News

వెంకయ్య, చంద్రబాబులపై రఘువీరా ఫిర్యాదు


ఏపీసీసీ చీఫ్‌ రఘువీరారెడ్డి ప్రధాని మోదీ, వెంకయ్య, చంద్రబాబులపై  పెనుగొండ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రత్యేక హోదా విషయంలో ప్రజలను వారు మోసం చేశారని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు.  ఇసుక అక్రమ రవాణా మంత్రులు, టీడీపీ నాయకులకు రాష్ట్రప్రభుత్వం ఇచ్చిన ప్రత్యేక ప్యాకేజీ అని రఘువీరా ఆరోపించారు.  ఓటుకు నోటు కేసులో బయటపడడమే చంద్రబాబుకు కేంద్రం ఇచ్చిన ప్రత్యేక ప్యాకేజీ అని అన్నారు.