News

ఎమ్మెల్యే కృష్ణమోహన్‌ టిడిపిలో చేరుతున్నారు


గతకొద్ద కాలంగా  ప్రకాశం జిల్లా చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణ మోహన్‌ టిడిపిలో చేరేందుకు ప్రయత్నిస్తున్నప్పటికీ, కొంతమంది వ్యతిరేకిస్తుండడంతో ఆలస్యం అయింది. కృష్ణమోహన్‌ ఇండిపెండెంట్‌గా పోటీ చేసి గెలిచారు.  అంతకుముందు కాంగ్రెస్‌ తరఫున పోటీచేశారు. బుధవారం టిడిపిలో చేరుతున్నారు. చంద్రబాబు నుంచి గ్రీన్‌ సిగ్నల్‌ రావడంతో ఆయన పార్టీలో చేరిక సునాయాసమైంది.  మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీలో నుంచి టిడిపిలోకి చేరుతున్నానని చెప్పారు.