News

జగన్‌ పగటి కలలు కంటున్నారు:చినరాజప్ప


జగన్‌ ప్రభుత్వం పడిపోతుందని జగన్‌ పగటి కలలు కంటున్నారని కల ఎప్పటికీ నెరవేరదని ఉపముఖ్యమంత్రి చినరాజప్ప అన్నారు.  ప్రత్యేక హోదా కోసం సిఎం బాబు కృషిచేస్తున్నారన్నారు. ప్రత్యేకహోదాని అడ్డుపెట్టుకుని ప్రజలను రెచ్చగొట్టేలా జగన్‌ వ్యవహరించడం సరికాదని ఆయన అన్నారు. పవన్ కల్యాణ్ మంచి సలహాలు ఇస్తే స్వీకరిస్తామని ఆయన ప్రయోజనాల కోసమే మాట్లాడారని చినరాజప్ప అన్నారు. త్వరలోనే కాపుల కోసం కార్పొరేషన్ ఏర్పాటు చేస్తున్నట్లు చినరాజప్ప వెల్లడించారు. బీసీలకు ఇబ్బందులు రాకుండా కాపులను బీసీల్లో చేరుస్తామన్నారు.