News

రేషన్‌ దుకాణాల్లో ఉల్లి:గంటా శ్రీనివాస్


ప్రజలకు అందుబాటులో ఉండేలా రేషన్‌ దుకాణాల్లో ఉల్లి పంపిణీ చేసే అంశాన్ని పరిశీలిస్తున్నామని మంత్రి గంటా శ్రీనివాస్ తెలిపారు. కంచరపాలెం రైతుబజారులో ఉల్లి విక్రయ కేంద్రాన్ని పరిశీలించారు. ప్రభుత్వం సబ్సిడీలో ఉల్లిని పంపిణీ చేస్తోందని చెప్పారు. రైతు బజార్లలో అక్రమాలకు పాల్పడితే సహించేది లేదని గంటా హెచ్చరించారు. త్వరలోనే ఉల్లి ధరలు తగ్గుతాయని మంత్రి ఆశించారు.