ఉర్దూ భాష భోధన ప్రారంభం
ప్రైవేటు పాఠశాలలలో మొట్టమొదటి సారిగా ముస్లిం విద్యార్ధుల ఉపయోగార్ధం, ముస్లిం తల్లిదండ్రుల కోరిక మేరకు ఉర్దూ భాష భోదనను విజ్ఞాన్ స్కూల్ లో ప్రారంభిస్తున్నట్లు స్కూల్ డైరెక్టర్ శ్రీమతి తన్నీరు సుధారాణి తెలిపారు . శనివారం సాయంత్రం విజ్ఞాన్ స్కూల్ జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన మునిసిపల్ చైర్మన్ మరియు స్కూల్ సెక్రటరీ / కరస్పాండెంట్ తన్నీరు నాగేశ్వరరావు విద్యార్ధుల ఉద్దేశించి మాట్లాడుతూ ఉర్దూ భాష లో డిగ్రీ పొందిన వారు తక్కువగా ఉండటం వలన ఉర్దూ భాషకు సంబందించిన ఉద్యోగాలకు నోటిఫికేషన్ పడినపుడు ఉద్యోగాలు ఎక్కువగా ఉండటం , వాటికి అప్లై చేసే అభ్యర్ధులు తక్కువగా ఉండటం మనం చూస్తున్నామని , రాష్ట్ర ద్వితీయ భాషగా గుర్తింపు పొందిన ఉర్దూ భాషలో డిగ్రీ పొందినట్లయితే భవిష్యత్తులో మంచి అవకాశాలను సొంతం చేసుకోగలరని, ఉర్దూ భాష బోధకులుగా మజీద్ హుబా ఇమామ్ మరియు కతీఫ్ ముఫ్తీ ఇలియాజ్ సాహెబ్ నియమితులైనారని, ఇటువంటి విశిష్టమైన కోర్సును విజ్ఞాన్ లో ప్రారంభించటం సంతోషంగా ఉందని తెలిపారు . ఈ సందర్భంగా ఉర్దూ భాష కోర్స్ కు సంభందించిన పుస్తకాలను ఆవిష్కరించారు . కోర్స్ నేర్చుకోవటానికి ముందుకు వచ్చిన విద్యార్ధులకు నోట్ బుక్స్ , పెన్నులు బహూకరించారు . కార్యక్రమంలో పాల్గొన్న ముస్లిం ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ షేక్ అహ్మద్ , మాజీ వక్ఫ్ బోర్డ్ చైర్మన్ షేక్ బిలాల్ ఉర్దూ భాష ఔన్నత్యాన్ని విద్యార్ధులకు వివరించారు . ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ షేక్ సులేమాన్ , ఉపాధ్యాయులు గోపాలరావు , నజీర్, NCC ఆఫీసర్ పి.శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు
Related News
-
అమ్మ ఫొటో మాయమైంది
-
నడిరోడ్డుపై కారులో మంటలు...
-
ఎమ్మెల్యేల జీతాలు భారీగా పెంపు!
-
డ్రగ్స్ రాకెట్‌పై స్పందించిన చార్మీ తండ్రి
-
మాయా రాజీనామా.. భారీ వ్యూహం!
-
సెల్ఫోన్లు లాక్కుని, వీడియోలు డిలీట్ చేసిన పూరీ తమ్ముడు
-
కేటీఆర్‌పై షబ్బీర్ అలీ ఫైర్
-
కాంగ్రెస్‌కు భారీ ఎదురుదెబ్బ..బీజేపీలోకి మాజీ సీఎం..
-
జగన్‌కు మంత్రి సవాల్
-
ఫ్లిప్‌కార్ట్ మరో భారీ ఆఫర్








