News

జగన్‌పై ప్రత్తిపాటి పుల్లారావు మండిపడ్డారు


ప్రజలను మభ్యపెట్టేందుకే చంద్రబాబుపై బురద జల్లుతున్నారని జగన్‌పై మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు మండిపడ్డారు. జగన్ నీచరాజకీయాలను మానుకోవాలని హితవు పలికారు. సీఎం కావాలని పగటి కలలు కంటున్నారని, అది సాధ్యం కాదని ప్రత్తిపాటి అన్నారు. ఈనెల 20 తర్వాత భూసేకరణ నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు తెలిపారు. సెప్టెంబర్ 13న కరువు మండలాలను ప్రకటిస్తామని ప్రత్తిపాటి తెలిపారు. తుళ్లూరు మండలంలోని 720 ఎకరాల సేకరణకు మొదటి విడత నోటిఫికేషన్ విడుదల చేసినట్లు ఆయన చెప్పారు.