News
కెసిఆర్‌పై జానారెడ్డి విమర్శలు చేశారు
ఇందిరమ్మ ఇళ్ల పధకంలో అవకతవకల పేరుతో బకాయిలు చెల్లించకుండా, ఇళ్లు నిర్మించకుండా ప్రభుత్వం చేస్తున్న తీరు ప్రజలలో తీవ్ర వ్యతిరేకత వస్తున్నదని సిఎం కెసిఆర్ పై విపక్ష నేత జానారెడ్డి విమర్శలు చేశారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో అవకతవకలు ఉంటే ఏ పార్టీ వారైనా చర్యలు తీసుకోవచ్చని ఆయన అన్నారు. కాని ఆ పేరుతో పేదల ఇళ్ల బిల్లులు పెండింగులో ఉండడం ప్రభుత్వానికి తగదని అన్నారు.నీటి పారుదల ప్రాజెక్టుల విషయంలో కూడా చెప్పేదానికి,జరుగుతున్నదానికి పొసగడం లేదని అన్నారు.ప్రజలలో ప్రభుత్వంపై అసంతృప్తి వస్తోందన్న సంగతి గమనించాలని అన్నారు. ప్రభుత్వాన్ని క్యాంప్ ఆఫీస్ నుంచి కాకుండా సచివాలయం నుంచి నడపాలని ఆయన సూచించారు.
Related News
-
అమ్మ ఫొటో మాయమైంది
-
నడిరోడ్డుపై కారులో మంటలు...
-
ఎమ్మెల్యేల జీతాలు భారీగా పెంపు!
-
డ్రగ్స్ రాకెట్‌పై స్పందించిన చార్మీ తండ్రి
-
మాయా రాజీనామా.. భారీ వ్యూహం!
-
సెల్ఫోన్లు లాక్కుని, వీడియోలు డిలీట్ చేసిన పూరీ తమ్ముడు
-
కేటీఆర్‌పై షబ్బీర్ అలీ ఫైర్
-
కాంగ్రెస్‌కు భారీ ఎదురుదెబ్బ..బీజేపీలోకి మాజీ సీఎం..
-
జగన్‌కు మంత్రి సవాల్
-
ఫ్లిప్‌కార్ట్ మరో భారీ ఆఫర్








