హైదరాబాద్‌లో ఓట్ల అక్రమంగా తొలగిస్తున్నారు
తెలంగాణ టిడిపి ఎమ్మెల్యేలు, నేతలు ఎన్నికల ముఖ్య అదికారి బన్వర్ లాల్ కు వినతిపత్రం ఇచ్చారు. హైదరాబాద్ లో ఓట్ల అక్రమంగా తొలగిస్తున్నారని తెలుగుదేశం ఎమ్మెల్యేలు ఆరోపించారు. ఆ తర్వాత జూబ్లిహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాధ్ మాట్లాడుతూ టిఆర్ఎస్ ప్రభుత్వం కుట్రపూరితంగా ఓట్లను తొలగిస్తున్నదని విమర్శించారు.హైదరాబాద్ నగరంలోని టిడిపి, బిజెపి ఎమ్మెల్యేలు ప్రాతినిద్యం వహిస్తున్న నియోజకవర్గాలలో అత్యధిక ఓట్లు తొలగిస్తున్నారని అన్నారు. వచ్చే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలలో గెలవలేమని భయపడ్డ టిఆర్ఎస్ ప్రభుత్వం ఈ విదంగా ఓట్ల తొలగింపునకు పాల్పడుతోందని ఆరోపించారు.సుమారు ముప్పై నాలుగు లక్షల ఓట్ల తొలగింపునకు నోటీసులు ఇచ్చారని అన్నారు. ఆధార్ కార్డు లేకపోతే ఓటు ఉండదని చెబుతూ నోటీసులు ఇస్తున్నారని ఆయన అన్నారు.
Related News
-
అమ్మ ఫొటో మాయమైంది
-
నడిరోడ్డుపై కారులో మంటలు...
-
ఎమ్మెల్యేల జీతాలు భారీగా పెంపు!
-
డ్రగ్స్ రాకెట్‌పై స్పందించిన చార్మీ తండ్రి
-
మాయా రాజీనామా.. భారీ వ్యూహం!
-
సెల్ఫోన్లు లాక్కుని, వీడియోలు డిలీట్ చేసిన పూరీ తమ్ముడు
-
కేటీఆర్‌పై షబ్బీర్ అలీ ఫైర్
-
కాంగ్రెస్‌కు భారీ ఎదురుదెబ్బ..బీజేపీలోకి మాజీ సీఎం..
-
జగన్‌కు మంత్రి సవాల్
-
ఫ్లిప్‌కార్ట్ మరో భారీ ఆఫర్








