News

ఆగస్టు 15న గ్రామజ్యోతి పథకం:కేసీఅర్


ఆగస్టు 15న ఎంసిఆర్‌హెచ్‌ఆర్డీలో ప్రారంభించనున్న గ్రామజ్యోతి పథకంపై సీఎం చంద్రశేఖర్ రావు గారు సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశంలో గ్రామజ్యోతి కోసం ఏర్పడిన మంత్రివర్గ ఉప సంఘం, జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, సంయుక్త కలెక్టర్లు సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిఎం చంద్రశేఖర్ రావు గారు మాట్లాడుతూ ప్రజలను భాగస్వామ్యం చేసి పంచాయితీరాజ్ వ్యవస్థలో మార్పు సాధించాలా చూడాలన్నారు. హైదరాబాద్ కేంద్రంగా పంచాయతీరాజ్ సంస్థల విస్తరణ జరిగింది. ఇప్పుడు అలా కావడానికి వీలు లేదు. ప్రజల సంఘటిత శక్తి బలమేంటో గుర్తించాలి. ఎవరి ఊరు ఎలా ఉండాలో ప్లాన్ చేసుకునేలా నేర్పాలన్నారు.