News

కేసీఅర్‌తో కలిసి ప్రత్యూష భోజనం చేశారు


సిఎం కే.చంద్రశేకర్ రావు గారి కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యూష భోజనం చేశారు. హైకోర్టు నుంచి సీఎం అధికారిక నివాసానికి వెళ్లిన ప్రత్యూషను కేసీఆర్ ఆప్యాయంగా పలకరించి ఆహ్వానం పలికారు. అనంతరం ప్రత్యూష ఆరోగ్య పరిస్థితిపై సీఎం వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రత్యూష గ్లోబల్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఆస్పత్రి నుంచి నేరుగా ప్రత్యూషను హైకోర్టుకు తరలించారు పోలీసులు. ప్రత్యూషను న్యాయస్థానం ఎదుట పోలీసులు హాజరుపరిచారు. ఈ సందర్భంగా ప్రత్యూషతో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఇరవై ఐదు నిమిషాల పాటు మాట్లాడారు. ప్రత్యూషకు అండగా ఉంటానన్న సీఎం కేసీఆర్‌ను ప్రధాన న్యాయమూర్తి అభినందించారు. ప్రత్యూషను సీఎం కేసీఆర్ నివాసానికి తరలించాలని న్యాయమూర్తి ఆదేశించారు. అనంతరం ప్రత్యూషను సీఎం అధికారిక నివాసానికి తీసుకెళ్లారు.