News

కలాంకు రాహుల్‌ గాంధీ నివాళులర్పించారు


కలాంకు కాంగ్రెస్ యువనేత రాహుల్‌ గాంధీ నివాళులర్పించారు. అబ్దుల్ కలాం ప్రజల మనిషి అని రాహుల్‌గాంధీ తెలిపారు. కలాం విజన్‌ను, ఆయన ఆలోచనలను కోల్పోయామని రాహుల్ ఆవేదన వ్యక్తం చేశారు. చివరి క్షణం వరకు దేశం కోసం పనిచేసిన మహోన్నత వ్యక్తి అబ్దుల్‌ కలాం అని రాహుల్ అన్నారు. యువతలో ఆలోచనలను తట్టిలేపిన గొప్ప వ్యక్తి కలాం అని చెప్పారు. రాష్ట్రపతిగా దేశానికి ఆయన అందించిన సేవలు మరువలేనివన్నారు. దేశం మొత్తం ఆయన ఆలోచనలను ఆదర్శంగా తీసుకోవాలని ఆయన చెప్పారు. కలాం ఆశయ సాధనకు యువత పాటుపడాలని రాహుల్ గాంధీ సూచించారు.