News

రేవంత్‌కి ప్రాణహాని ఉంది:కృష్నారెడ్డి


టిడిపి ఎమ్మెల్యే రేవంత్ రెడ్డికి ప్రాణహాని ఉందని ఆయన సోదరుడు కృష్ణారెడ్డి అన్నారు.ఏమైనా జరిగితే ముఖ్యమంత్రి కెసిఆర్ బాద్యత వహించాల్సి ఉంటుంది. కెసిఆర్ అవినీతిని, అక్రమాలను ప్రశ్నించినందుకే రేవంత్ ను ఓటుకు నోటు కేసులో ఇరికించారని ఆయన ఆరోపించారు.తెలంగాణలో టిడిపి లేకుండా పోవాలని కెసిఆర్ కుట్ర అని ఆయన అన్నారు.కొడంగల్,హైదరాబాద్ లలో రేవంత్ ఇంటి పరిసరాలలో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు తిరుగుతున్నారని, ఈ సమాచారం తమ దృష్టికి వచ్చిందని కృష్ణారెడ్డి చెప్పారు.వీరి వల్ల రేవంత్ కు ఏదైనా జరగవచ్చనే అనుమానం ఉందని, కనుక పూర్తి భద్రత కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు.