News
జగన్ మరోసారి జిల్లాలో పర్యటించబోతున్నారు
శాసనసభలో విపక్ష నేత, వైఎస్ ఆర్ కాంగ్రెస్ అదినేత జగన్ మరోసారి అనంతపురం జిల్లాలో పర్యటించబోతున్నారు.రైతు భరోసా యాత్ర పేరుతో ఆత్మహత్యలు చేసుకున్న రైతుల కుటుంబాలను ఆయన పరామర్శించి, తమ పార్టీ పరంగా సాయం చేస్తారు. ఈ నెల ఇరవైనాలుగో తేదీన ఎఐసిసి ఉపాద్యక్షుడు రాహుల్ గాందీ అనంతపురం జిల్లాలో పర్యటించబోవడానికి ముందుగానే జగన్ అక్కడకు ఈ నెల ఇరవైఒక్కటిన వెళతారు.మూడు శాసనసభ నియోజకవర్గాలలో ఆయన యాత్ర కొనసాగిస్తారు.అనంతపురం జిల్లాలో గత ఎన్నికలలో పార్టీ అనూహ్యంగా దెబ్బ తిన్న నేపధ్యంలో జగన్ ఆ జిల్లాపై ఎక్కువ దృష్టి కేంద్రీకరిస్తున్నారని అంటున్నారు. ఇప్పటికి రెండుసార్లు వెళ్లిన జగన్ తాజాగా మూడోసారి భరోసా యాత్రకు వెళుతున్నారు.
Related News
-
అమ్మ ఫొటో మాయమైంది
-
నడిరోడ్డుపై కారులో మంటలు...
-
ఎమ్మెల్యేల జీతాలు భారీగా పెంపు!
-
డ్రగ్స్ రాకెట్‌పై స్పందించిన చార్మీ తండ్రి
-
మాయా రాజీనామా.. భారీ వ్యూహం!
-
సెల్ఫోన్లు లాక్కుని, వీడియోలు డిలీట్ చేసిన పూరీ తమ్ముడు
-
కేటీఆర్‌పై షబ్బీర్ అలీ ఫైర్
-
కాంగ్రెస్‌కు భారీ ఎదురుదెబ్బ..బీజేపీలోకి మాజీ సీఎం..
-
జగన్‌కు మంత్రి సవాల్
-
ఫ్లిప్‌కార్ట్ మరో భారీ ఆఫర్








