News

జగన్‌తో హైద్రాబాద్‌లో ఎంపీల సమావేశం


వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితో హైద్రాబాద్‌లో ఆ పార్టీ ఎంపీల సమావేశం ముగిసింది. సమావేశం అనంతరం ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి మాట్లాడుతూ... 21న ప్రారంభమయ్యే పార్లమెంట్‌ సమావేశాల్లో ఏపీకి ప్రత్యేక హోదా, పోలవరం నిర్మాణం, రైల్వే జోన్‌, భూ సేకరణ బిల్లుపై పార్టీ అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించడం జరిగిందన్నారు. అలాగే రాజమండ్రి గోదావరి పుష్కరాల్లో జరిగిన తొక్కిసలాట దుర్ఘటన, ఓటుకు నోటు వ్యవహారంపై పార్లమెంట్‌లో చర్చిస్తామని తెలిపారు. పాలమూరు ప్రాజెక్టుకు వైకాపా వ్యతిరేకమని స్పష్టం చేశారు