News

కేసీఆర్‌ ధర్మపురి చేరుకున్నారు


గోదావరి పుష్కరాల్లో పాల్గొనేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు గారు ధర్మపురి చేరుకున్నారు. హెలికాప్టర్‌లో ఆయన హైదరాబాద్ నుంచి ధర్మపురి వెళ్లారు. రాత్రి ధర్మపురిలోని హరిత హోటల్‌లో కేసీఆర్ బస చేస్తారు. 14వ తారీకు ఉదయం 5.30 కు దేవస్థానానికి చేరుకొని పుష్కరాల ప్రారంభ శోభాయాత్రలో పాల్గొంటారు.