News

మున్సిపల్‌ కార్మికుల సమ్మెపై సమావేశం


తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌ రావు అధ్యక్షతన సీఎం క్యాంప్‌ ఆఫీస్‌లో మున్సిపల్‌ కార్మికులు కొద్దిరోజులుగా చేస్తున్న సమ్మెపై ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం జరుపుతున్నారు. కార్మికులు విధుల్లో చేరాలంటూ లేకుంటే చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం ప్రకటన చేసిన నేపథ్యంలో సీఎం అధ్యక్షతన ఉన్నతస్థాయి సమావేశం ప్రాధాన్యత సంపాదించుకుంది. సమావేశంలో మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, మహేందర్‌ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌ శర్మ, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ సోమేశ్‌ కుమార్‌తో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.