News

చింతమనేనిని వెంటనే అరెస్ట్‌ చేయాలి: కావూరి


చింతమనేనిని వెంటనే అరెస్ట్‌ చేయాలని, బీజేపీ నేత కావూరి సాంబశివరావు డిమాండ్ చేశారు. లేదంటే టీడీపీతోపాటు బీజేపీకి చెడ్డపేరు వస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. చంద్రబాబు సదుద్దేశంతో డ్వాక్రా గ్రూపులకు ఇసుక రీచ్‌లు ఇస్తే వారిని అడ్డం పెట్టుకుని చింతమనేని కోట్లు గడిస్తున్నారని కావూరి విమర్శించారు. అరాచక శక్తులను చంద్రబాబు ఉపేక్షించకూడదన్నారు. ఇలాంటి ఘటనలను ముందుగానే కట్టడి చేయకపోతే రాజకీయాల్లో నేర శక్తులు పెరిగిపోతాయని బీజేపీ నేత కావూరి సాంబశివరావు హెచ్చరించారు