News

డియస్‌ది ఆత్మవంచనే కాంగ్రెస్‌నేత భట్టి


పిసిసి మాజీ అద్యక్షుడు డి.శ్రీనివాస్ ఆత్మవంచన చేసుకుని పార్టీ మారారని కాంగ్రెస్ వర్కింగ్ అద్యక్షుడు మల్లు భట్టి విక్రమార్క విమర్శించారు. మహబూబ్ నగర్ జిల్లాలో ఆయన మీడియాతో మాట్లాడారు.ఎంతోమంది కి పార్టీ టెక్కెట్లను ఇచ్చిన ఆయన , మంత్రిగా,శాసనమండలిలో విపక్ష నేతగా కాంగ్రెస్ లో పదవులు నిర్వహించారని,కాని చివరికి చిన్న పదవి కోసం కాంగ్రెస్ ను వదలి టిఆర్ఎస్ లో చేరారని ,ఇది ఆత్మ వంచనే అని ఆయన అన్నారు.కాంగ్రెస్ పార్టీ ప్రతికూల పరిస్థితులలో ఉన్నప్పుడు ఇలాంటి వారు వెళ్లడం బాదాకరమని అన్నారు.ముస్లింలకు పన్నెండు శాతం రిజర్వేషన్లు ఇస్తామని చెప్పిన కెసిఆర్ ఏడాది అయినా ఇంతవరకు ఎందుకు అమలు చేయలేకపోయారని ఆయన ప్రశ్నించారు