News

పవన్‌‌పై వర్మ సెటైర్స్


వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ తరచూ వార్తల్లో ఉండే దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మ ఈసారి పవన్‌ను టార్గెట్‌ చేశాడు. పవన్‌‌ పిల్లిలా ప్రవర్తించకూడదని హితవు చెప్పాడు. ఓటుకు నోటు కేసుపై పవన్‌ స్పందించిన వీడియోని చూసిన అనంతరం  ట్విట్టర్‌లో వర్మ రెచ్చిపోయాడు. ‘‘పవన్ ఒక గర్జించే సింహం.. సింహం ఆలోచించి గర్జిస్తే ఆ గర్జనకు అర్థం లేదు.. నిన్న పవన్ స్పీచ్‌లో నాకు అనిపించింది ఇదే. కానీ ఈ విషయం పవన్‌కే బాగా తెలుసు. సింహం అర్థం చేసుకోవాల్సింది... సింహం, సింహంలా ఉండాలి. తన గర్జనలోని అతరార్థం కుక్కలకు వివరించకూడదు. సింహం జూలో ఉందంనే భ్రమలో కుక్కలున్నాయి. కానీ సింహం తలచుకుంటే ఎప్పుడైనా అటాక్ చేయగలదని కుక్కలు తెలుసుకోవాలి.  సింహం గర్జనలోని అర్థం వెతకటం.. కుక్కల మొరుగుల్లో లాజిక్ వెతకటం లాంటిది. సింహం ఆలోచించదు.. కోతులు ఆలోచిస్తాయి.. మనుషులు నేర్చుకుంటారు. కానీ, ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే.. గర్జించాల్సిన సింహం పిల్లిలా మాట్లాడుతోంది. పవన్‌ను  అభిమానులు పులిలా భావిస్తున్నారు. మేకకు, మొక్కకు తేడా తెలియని సింహం సింహం కాదు. ఒక పులి మేకలా ప్రవర్తించి తప్పుచేయకూడదు.. పవన్ ఎప్పుడూ బెస్ట్‌గానే ఉండాలని కోరుకుంటున్నాను.’’అని వర్మ ట్వీట్ చేశాడు.