ఆన్‌లైన్ లో భద్రాద్రి రాముడి సేవా టికెట్లు
పుష్కరాల సమయంలో రద్దిని దృష్టిలో ఉంచుకొని, భక్తుల సౌకర్యార్థం భద్రాచల శ్రీ సీతారామచంద్రస్వామి వారి శీఘ్ర దర్శనం,నిత్యకళ్యాణం, సహస్ర నామార్చన, ఉంజల్ సేవల టికెట్లను ఎక్కడి నుండైనా ఆన్ లైన్ ద్వారా బుక్ చేసుకునే సదుపాయాన్ని దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ప్రారంబించారు. సచివాలయంలోని తన చాంబర్ లో ఆన్ లైన్ పోర్టల్ ను మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ప్రారంభించారు. పుష్కర ఉత్సవాలు జరిగే 12 రోజుల్లో ( 14-7-2015 నుండి 25-7-15) ఏ రోజుకైనా శీఘ్ర దర్శనం, సేవల టికెట్ లను ఆన్ లైన్ ద్వారా బుక్ చేసుకోవచ్చని తెలిపారు.. ప్రస్తుతం రోజుకు 15000 శీఘ్ర దర్శనం టికెట్ లు 800 నిత్య కళ్యాణం టికెట్లు, 800 సహస్ర నామార్చన, 800 ఉంజల్ సేవల టికెలను అందుబాటులో ఉంచినట్లు వెల్లడించారు. దీని కోసం భక్తులు తమ ఫోటో, ప్రభుత్వం చే జారీ చేయబడిన ఏదైనా గుర్తింపు కార్డు వివరాలు నమోదు చేసి, క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా చెల్లించి బుక్ చేసుకోవచ్చునని వివరించారు. భక్తులు ఈ సదుపాయాన్ని ఉపయోగించుకోవాలని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సూచించారు
Related News
-
అమ్మ ఫొటో మాయమైంది
-
నడిరోడ్డుపై కారులో మంటలు...
-
ఎమ్మెల్యేల జీతాలు భారీగా పెంపు!
-
డ్రగ్స్ రాకెట్‌పై స్పందించిన చార్మీ తండ్రి
-
మాయా రాజీనామా.. భారీ వ్యూహం!
-
సెల్ఫోన్లు లాక్కుని, వీడియోలు డిలీట్ చేసిన పూరీ తమ్ముడు
-
కేటీఆర్‌పై షబ్బీర్ అలీ ఫైర్
-
కాంగ్రెస్‌కు భారీ ఎదురుదెబ్బ..బీజేపీలోకి మాజీ సీఎం..
-
జగన్‌కు మంత్రి సవాల్
-
ఫ్లిప్‌కార్ట్ మరో భారీ ఆఫర్








