సియం కేసీఆర్ వైఖరి మార్చుకో : ఎల్ రమణ
ఇప్పటికైనా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తన వైఖరిని మార్చుకోవాలని తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎల్ రమణ అన్నారు. కేసీఆర్ తెలంగాణ ముఖ్యమంత్రిగా ఈ ఏడాది కాలంగా సాగించిన పాలన అంతా కక్షలూ కార్పణ్యాలతోనే సాగిందన్నారు. శనివారం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగరరావు పుస్తకావిష్కరణ సభలో సాక్షాత్తూ దేశ ప్రథమ పౌరుడు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేసిన వ్యాఖ్యలే కేసీఆర్ ఏడాది పాలన తీరుకు నిదర్శనమని ఆయన అన్నారు. హైదరాబాద్ ను విశ్వనగరంగా తీర్చిదిద్దాలన్నా, తెలంగాణకు పెద్ద ఎత్తున పెట్టుబడులు తరలి రావాలన్నా ముందుగా ప్రభుత్వ తీరు మారాల్సిన అవసరం ఉందని రమణ అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో విపక్షం లేకుండా చేయాలన్న ఆలోచనతో సాగుతున్న పాలనకు ఇప్పటికైనా ముగింపు పలకాలని రమణ హితవు పలికారు
Related News
-
అమ్మ ఫొటో మాయమైంది
-
నడిరోడ్డుపై కారులో మంటలు...
-
ఎమ్మెల్యేల జీతాలు భారీగా పెంపు!
-
డ్రగ్స్ రాకెట్‌పై స్పందించిన చార్మీ తండ్రి
-
మాయా రాజీనామా.. భారీ వ్యూహం!
-
సెల్ఫోన్లు లాక్కుని, వీడియోలు డిలీట్ చేసిన పూరీ తమ్ముడు
-
కేటీఆర్‌పై షబ్బీర్ అలీ ఫైర్
-
కాంగ్రెస్‌కు భారీ ఎదురుదెబ్బ..బీజేపీలోకి మాజీ సీఎం..
-
జగన్‌కు మంత్రి సవాల్
-
ఫ్లిప్‌కార్ట్ మరో భారీ ఆఫర్








