News

లలిత్‌మోదీ వివాదంలో ఇరకాటంలో కాంగ్రెస్


ఆర్థిక నేరాల ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐపిఎల్ మాజీ చైర్మన్ లలిత్‌మోదీ వివాదంలో ఇపుడు కాంగ్రెస్ చిక్కుకుంది. లండన్‌లో తాను సోనియా పుత్రిక ప్రియాంక, అల్లుడు రాబర్ట్ వాద్రాలను కలిశానని లలిత్‌మోదీ ట్విట్టర్ చేసిన ట్వీట్‌తో ఇపుడు కాంగ్రెస్ ఇరకాటంలో పడింది. లలిత మోదీ ఆర్థిక నేరాలకు సంబంధించి సుష్మా, వసుంధర రాజే రాజీనామా చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తున్న విషయం విదితమే. కాగా లలిత్‌మోదీ ఆరోపణలను కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్ సూర్జెవాలా ఖండించారు.