News

హైదరాబాద్‌పై హక్కులంటే తీవ్ర ప్రతిఘటన : కోదండరాం


సెక్షన్-8ను అడ్డుపెట్టుకుని తెలంగాణపై సీమాంధ్ర నాయకులు పెత్తనం చెలాయించాలని చూస్తే ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోమని ప్రొ.కోదండరాం పేర్కొన్నారు. హైదరాబాద్‌పై సెక్షన్-8 అమలుపై వస్తున్న వార్తలపై ఆయన స్పందిస్తూ.. సెక్షన్-8 పరిధి చాలా చిన్నది. గవర్నర్ తెలంగాణ ప్రభుత్వ అభిప్రాయాన్ని తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది. కేంద్రాన్ని అడ్డుపెట్టుకుని ఏపీ ప్రభుత్వం హైదరాబాద్‌పై హక్కులంటే తీవ్ర ప్రతిఘటన చర్యలుంటయని ఆయన పేర్కొన్నారు.