News

నడిరోడ్డుపై కారులో మంటలు...


కారు అగ్నికి ఆహుతి అయింది. అంథేరిలోని ఓ ఫ్లైఒవర్ కింద ఈ ఘటన జరిగింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన వచ్చి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఈలోగా కారు 80 శాతం కాలిపోయింది. కారుకు మంటలు అంటుకోగానే డ్రైవర్ అందులోంచి దూకేశాడు. సాంకేతిక లోపం కారణంగానే కారులో మంటలు అంటుకున్నట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నడిరోడ్డుపై కారుకు మంటలు అంటుకోవడంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.