News
డ్రగ్స్ రాకెట్‌పై స్పందించిన చార్మీ తండ్రి
టాలీవుడ్ సినీ ప్రముఖులకి కంటిమీద కునుకు లేకుండా చేసిన డ్రగ్స్ రాకెట్ కేసులో తన కూతురు చార్మీ నోటీసులు అందుకోవడంపై ఆమె తండ్రి దీప్ సింగ్ స్పందించారు. చార్మీ డ్రగ్స్ తీసుకుంటున్నట్టుగా వచ్చిన ఆరోపణలపై ఆమె బాగా డిస్టర్బ్ అయినట్టుగా దీప్ సింగ్ మీడియాకు తెలిపారు. ఓ లీడింగ్ నేషనల్ మ్యాగజైన్‌తో మాట్లాడిన దీప్ సింగ్... " తన కూతురు చార్మీ గురించి తనకి బాగా తెలుసని, 13 ఏళ్ల ప్రాయం నుంచే పని చేయడం మొదలుపెట్టిన చార్మీ ఒకవేళ ఇలాంటి అసాంఘీక కార్యకలాపాలకి పాల్పడి వున్నట్టయితే, ఇప్పటివరకు కెరీర్‌లో ఇంత సక్సెస్‌ఫుల్‌గా కొనసాగేది కాదు" అని ఆవేదన వ్యక్తంచేశారు. కష్టపడి పనిచేసే తత్వమే చార్మీకి ఇంకా అవకాశాలు తెచ్చిపెడుతోంది. తనపై డ్రగ్స్ వినియోగం ఆరోపణలు వస్తున్నప్పటికీ... ఆమె అవన్నీ లెక్క చేయకుండా ప్రస్తుతం పైసా వసూల్ సినిమాపైనే దృష్టి సారించింది అని అభిప్రాయపడ్డారు ఆమె తండ్రి.
Related News
-
అమ్మ ఫొటో మాయమైంది
-
నడిరోడ్డుపై కారులో మంటలు...
-
ఎమ్మెల్యేల జీతాలు భారీగా పెంపు!
-
డ్రగ్స్ రాకెట్‌పై స్పందించిన చార్మీ తండ్రి
-
మాయా రాజీనామా.. భారీ వ్యూహం!
-
సెల్ఫోన్లు లాక్కుని, వీడియోలు డిలీట్ చేసిన పూరీ తమ్ముడు
-
కేటీఆర్‌పై షబ్బీర్ అలీ ఫైర్
-
కాంగ్రెస్‌కు భారీ ఎదురుదెబ్బ..బీజేపీలోకి మాజీ సీఎం..
-
జగన్‌కు మంత్రి సవాల్
-
ఫ్లిప్‌కార్ట్ మరో భారీ ఆఫర్








