News

జగన్‌కు మంత్రి సవాల్


వైసీపీ ప్లీనరీలో 673 సార్లు సీఎంను తిట్టారని మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. పట్టిసీమ ద్వారా కృష్ణాకు గోదావరి జలాలు వచ్చింది నిజమా.. కాదా? అని మంత్రి అన్నారు. దమ్ముంటే జగన్‌ చర్చకు రావాలని మంత్రి దేవినేని ఉమ సవాల్ విసిరారు. కృష్ణాలో కలిసిన గోదావరి నీటిలోనే జగన్ పుష్కరస్నానం చేశారని దేవినేని గుర్తు చేశారు. నిజాన్ని అంగీకరించడానికి జగన్‌కు అహం అడ్డొస్తోందని మంత్రి దేవినేని విమర్శించారు. జగన్ అండ్ కో పథకం ప్రకారమే సీఎంపై బురద చల్లుతున్నారని మంత్రి ఆరోపించారు. ఉండవల్లి అరుణ్‌కుమార్ ఊసరవెల్లి అని.. ఉండవల్లిని అడ్డుపెట్టుకుని జగన్ పోలవరం పనులను అడ్డుకోవాలని చూస్తున్నారని దేవినేని ఉమ ఆరోపించారు.