News

సీఎం చంద్రబాబు కన్నతండ్రి


రాష్ట్రంలో బెల్ట్‌షాపులకు సీఎం చంద్రబాబు కన్నతండ్రి అని వైసీపీ ఎమ్మెల్యే రోజా విమర్శించారు. బెల్ట్‌షాపులను ఎత్తివేయాలని.. లేకపోతే మహిళలను కూడగట్టుకుని 10 రోజుల తర్వాత ఉద్యమిస్తామని, ఎక్కడ కనబడితే అక్కడ బెల్ట్ షాపులను పగలగొడతామని హెచ్చరించారు. వైసీపీ నుంచి 21 మంది ఎమ్మెల్యేలను టీడీపీలోకి తీసుకున్నారని వారందరితో రాజీనామా చేయించి ఎన్నికలకు వెళ్లాలని ఆమె డిమాండ్ చేశారు. నంద్యాల ఎన్నికల్లో మహిళల ఓట్ల కోసమే అమలు కాని హామీలిచ్చి చంద్రబాబు ప్రజల్ని మోసం చేశారని విమర్శించారు. జగన్‌ నవరత్నాల హామీలు చూసి...చంద్రబాబు నవ నాడులు చిట్లిపోయాయని, ప్రభుత్వం మెడలు వంచి పనిచేయిస్తున్నామని రోజా అన్నారు. ప్రపంచస్థాయి రాజధాని నిర్మిస్తామని చెప్పిన బాబు పాలనలో ప్రపంపస్థాయి బొక్కలు, బీటలు చూస్తున్నామని రోజా ఎద్దేవా చేశారు.