News

పార్టీనీ వీడటం బాధగా ఉంది: వెంకయ్య


ఎన్డీఏ ఉపరాష్ట్రతి అభ్యర్థిగా వెంకయ్య నాయుడు ఇవాళ ఉదయం నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన భావోద్వేగానికి లోనయ్యారు. ఏడాదిన్నర వయసులో తల్లిని కోల్పోయా.. పార్టీనే తల్లిగా భావిస్తూ జీవితం గడిపానని ఆయన తెలిపారు. "బీజేపీ వల్లే నేను ఈ స్థాయికి చేరుకున్నా.. పార్టీని వీడేటప్పుడు భావోద్వేగానికి గురయ్యానని వెంకయ్య మీడియాతో చెప్పారు. " నేను సాధారణ కుటుంబం నుంచి వచ్చాను.. నాలుగు దశాబ్దాలుగా ప్రజా జీవితంలో ఉన్నాను" అని ఆయన చెప్పుకొచ్చారు. ఇప్పుడు విభిన్న పాత్ర పోషించబోతున్నా.. నా పాత్రకు న్యాయం చేస్తాననే అనుకుంటున్నాను. ఎంతోమంది ఉన్నతమైన వ్యక్తులు అధిరోహించిన స్థానానికి మరింత వన్నె తెచ్చేలా వ్యవహరిస్తాను" అని వెంకయ్య తెలిపారు. ఉప రాష్ట్రపతి ఎన్నిక కోసం ప్రచారం చేసే ప్రసక్తేలేదు.. తనకు మద్దతిచ్చిన పార్టీలకు కృతజ్ఞతలు తెలిపారు.