News

మాజీ ఎంపీ ఉండవల్లి అరెస్ట్


పట్టిసీమ, పోలవరం ప్రాజెక్టులపై టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, మాజీ ఎంపీ ఉండవల్లి సై అంటే సై అంటున్నారు. ప్రాజెక్టులపై చర్చించేందుకు విజయవాడ దుర్గాఘాట్ వేదికగా ఈ ఇద్దరు బహిరంగ చర్చకు సిద్ధమయ్యారు. అయితే సెక్షన్-30 అమలులో ఉన్నందున దుర్గా ఘాట్‌లో చర్చకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో విజయవాడ శనేశ్వరాలయం దగ్గర ఉండవల్లిని పోలీసులు అరెస్ట్ చేశారు. పనీపాటలేని నాయకులు పట్టిసీమ, పోలవరం ప్రాజెక్టులపై అవాస్తవాలు చెబుతూ ప్రజల్లో అపోహలు సృష్టిస్తున్నారని ఎమ్మెల్యే గోరంట్ల ఫైర్ అయ్యారు. పదేళ్లపాటు కేంద్రం, రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పోలవరం పూర్తి చేయకుండా రాష్ట్రాన్ని భారీగా దోచుకుందని ఆయ విమర్శించారు.