News

సెప్టెక్ ట్యాంక్ క్లీన్ చేస్తుండగా నలుగురు దుర్మరణం


దేశరాజధానిలో నలుగురు పారిశుద్ధ్య కార్మికులు సెప్టెక్ ట్యాంక్ క్లీన్ చేస్తుండగా దుర్మరణం పాలయ్యారు. విషవాయువులతో శ్వాస అడక కార్మికులు దుర్మరణం పాలైనట్టు పోలీసులు తెలిపారు. వర్షపు నీటితో నిండిపోయిన డ్రైనేజీలు, మురుగుకాలువలను శుభ్రం చేసేందుకు సుమారు 250 మంది పారిశుద్ధ్య కార్మికులను అధికారులు రంగంలోకి దింపారు. ఘితోర్ని కాలనీలో సెప్టెంగ్ ట్యాంక్ క్లీన్ చేసేందుకు లోపలకు వెళ్లిన ఐదుగురు కార్మికులు ఎంతసేపటికీ బయటకు రాలేదు. దీంతో ఫైర్ డిపార్ట్‌మెంట్ సిబ్బంది రంగంలోకి దిగి గంటసేపు గాలించి ఆపస్మారక దశలో ఉన్న వారిని బయటకు తీశారు. అనంతరం హుటాహుటిన వారిని సఫ్తర్ జంగ్, ఫోరిస్ ఆసుపత్రులకు తరలించారు. అయితే నలుగురు అప్పటికే విషవాయువుల బారిన పడి మరణించినట్టు వైద్యులు ధ్రువీకిరించారు. చనిపోయిన కార్మికులను స్వర్న్ సింగ్ (45), దీపు (28) అనిల్ (23), బల్వీందర్ (32)గా గుర్తించారు. మరో కార్మికుడు చికిత్స పొందుతున్నాడు. ఈ ఐదుగురూ ఛత్తర్‌పూర్‌లోని అంబేద్కర్ కాలనీ వాసులుగా గుర్తించారు. ముఖానికి సరైన రక్షణ కవచాలు (మాస్క్) లేకుండా సెప్టిక్ ట్యాంకులో దిగడం వల్లే ఈ విషాద ఘటన చోటుచేసుకున్నట్టు చెబుతున్నారు.