News

భాజపా నేతపై గోరక్షకుల దాడి


గోవధలకు పాల్పడుతున్నారంటూ అమాయకుల్ని చావగొడుతున్న గోరక్షకులు ఇప్పుడు ఓ భాజపా నేతపై దాడి చేశారు. మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌కి చెందిన సలీం షా అనే భాజపా నేత బీఫ్‌ తరలిస్తున్నాడన్న అనుమానంతో ఐదుగురు గోరక్షకులు అతనిపై దాడికి దిగారు. దాంతో అతను స్రృహకోల్పోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సలీంను చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. నిందితులను అదుపులోకి తీసుకున్నారు. సలీం బీఫ్‌ తీసుకెళుతున్నాడా? లేదా? అన్న విషయాన్ని నిర్ధారించుకునేందుకు అతని వద్ద ఉన్న బ్యాగ్‌ను ఫోరెన్సిక్‌ బృందానికి అప్పగించారు. దీనిపై సలీం భార్య మాట్లాడుతూ.. తాము బీఫ్‌ తరలించడం లాంటవి చేయమని స్థానిక మసీదులో జరుగుతున్న కార్యక్రమానికి మాంసం తరలిస్తున్నామని తెలిపింది.