News

టెన్త్‌ మెమో పోయిందని విద్యార్థి ఏం చేసాడో చూడండి


టెన్త్‌ సర్టిఫికెట్‌ పోయిందనే మనస్తాపంతో ఓ విద్యార్థి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తాను డిగ్రీ చదివిన కాలేజీ అధ్యాపకుల నిర్లక్ష్యం వల్లే మెమో పోయిందని సూసైడ్‌ నోట్‌ రాశాడు. ఖమ్మం నగర శివారులోని గోపాలపురానికి చెందిన మాగంటి లక్ష్మణుడు (22) ఇటీవల ఖమ్మం ప్రభుత్వ కాలేజీ లో డిగ్రీ పూర్తి చేశాడు. పీజీ ప్రవేశ పరీక్ష రాసిన అతడు కౌన్సెలింగ్‌కు అవసరమైన సర్టిఫికెట్ల కోసం దరఖాస్తు చేసుకోగా డిగ్రీ మెమో, తదితర సర్టిఫికెట్లతోపాటు టీసీని కాలేజీ వారు అందజేశారు. వాటిలో టెన్త్‌ సర్టిఫికెట్‌ లేకపోవడంతో మనోవేదనకు గురయ్యాడు. టెన్త్‌ సర్టిఫికెట్‌ లేకుంటే పీజీ కౌన్సెలింగ్‌కు అనుమతించరని భావించి ఇంట్లోని సీలింగ్‌ ఫ్యాన్‌కు ఉరేసుకున్నాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పోలీసులు ఖమ్మం ప్రభుత్వాస్పత్రికి తరలించగా బంధువులు మార్చురీ రూం తలుపులు పగులగొట్టి శవాన్ని బలవంతంగా తరలించారు. మృతదేహంతో డిగ్రీ కాలేజీ వద్ద ఆందోళనకు యత్నించగా పోలీసులు అడ్డగించి మృతదేహాన్ని తిరిగి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. విద్యార్థి సంఘాల నాయకులు డిగ్రీ కళాశాలకు చేరుకొని ప్రిన్సిపాల్‌తో చర్చించారు.