News

డ్రగ్స్ కేసులో నోటీసులందుకున్న సినీ ప్రముఖులు వీళ్లే


డ్రగ్స్ కేసులో పట్టుబడిన కెల్విన్‌‌ను విచారిస్తున్న సమయంలో అనేక కొత్త కోణాలు వెలుగు చూశాయి. కెల్విన్‌ కాల్‌డేటా, వాట్సాప్‌ చాటింగ్‌ ఆధారంగా విచారణ జరిపిన అధికారులు.. అతడితో సంబంధమున్న అందరికీ నోటీసులు పంపారు. ఇప్పటి వరకు 19 మందికి నోటీసులు పంపగా అందులో 12 మంది ప్రముఖుల పేర్లు బయటకు వచ్చాయి.  వీరిని ఈ నెల 19 నుంచి 27 వరకు ప్రశ్నించనున్నారు.  హీరో, హీరోయిన్‌, డైరెక్టర్‌, ప్రొడ్యూసర్‌ అన్న తేడా లేకుండా మత్తు పదార్థాలు, మాదక ద్రవ్యాలతో సంబంధం ఉన్నవారందరినీ విచారించేందుకు ఎక్సైజ్ శాఖ రంగం సిద్ధం చేసింది.  ఇప్పటికే గుర్తించి, నోటీసులు పంపించిన వారందరినీ వారంపాటు విచారించనుంది. ఇందులో ప్రముఖ హీరో రవితేజ, ప్రముఖ డైరెక్టర్ పూరీ జగన్నాథ్‌, హీరోయిన్ చార్మీతో పాటు పలువురు సినీ ప్రముఖులు ఉన్నట్లు తెలుస్తోంది. నాలుగేళ్ల క్రితమే కెల్విన్‌ సినీ పరిశ్రమపై కన్నేసినట్లు అధికారుల విచారణలో తేలింది.