News
తిరుమలలో కిడ్నాపైన బాలుడు
తిరుమల దేవస్థానం ప్రాంగణంలో అపహరణకు గురైన బాలుడి కథ సుఖాంతమైంది. బాలుణ్ని కిడ్నాప్ చేసిన వారిని తమిళనాడు పోలీసులు అరెస్టు చేశారు. ఆ బాలుడితో పాటు కిడ్నాపర్లను తిరుమలకు తరలిస్తున్నారు. తమిళనాడులోని నమ్మకళ్ జిల్లా రాశిపురానికి చెందిన దంపతులు పిల్లాణ్ని ఎత్తుకెళ్లినట్టు గుర్తించారు. పిల్లలు లేని కారణంగా పెంచుకుందామనే ఉద్దేశంతోనే ఆ బాలుణ్ని అపహరించినట్లు కిడ్నాపర్లు పోలీసుల వద్ద వాపోయారు. అనంతపురం జిల్లా సాయిపురానికి చెందిన వెంకటేశ్ కుమారుడు జూన్ 14న తిరుమలలో కిడ్నాపైన సంగతి తెలిసిందే. జూన్ 13న వెంకటేశ్ తన కుటుంబంతో పాటు తిరుమలకు వచ్చాడు. శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనం అనంతరం అదే రోజు సాయంత్రం ఆ కుటుంబం.. ఆలయం ఎదుట ఖాళీ ప్రదేశంలో నిద్రకు ఉపక్రమించింది. మరుసటి రోజు తెల్లవారు జామున లేచి చూడగా.. వెంకటేశ్ దంపతుల ఏడాది వయసున్న కుమారుడు చెన్నకేశవులు కనిపించలేదు. ఆ ప్రాంగణమంతా గాలించినా జాడ దొరక్కపోవడంతో.. కిడ్నాప్‌కు గురైనట్లు అనుమానించి పోలీసులను ఆశ్రయించారు. తమ ముద్దుల తనయుడు దొరికేంత వరకూ తిరుమల వీడేది లేదంటూ.. ఆ కుటుంబం 15 రోజులుగా అక్కడే ఉంది. బాలుడి కోసం నాటి నుంచి పోలీసులు ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు. టీటీడీ ప్రాంగణంలో అమర్చిన పలు సీసీటీవీ కెమెరాల్లో ఫుటేజీలను పరిశీలించి నిందితులను గుర్తించారు. కిడ్నాపర్లు శ్రీవారి ఆలయం నుంచి కల్యాణకట్ట మీదుగా శేషాద్రినగర్ వెళ్లినట్లు ఫుటేజీల్లో రికార్డైంది.
Related News
-
అమ్మ ఫొటో మాయమైంది
-
నడిరోడ్డుపై కారులో మంటలు...
-
ఎమ్మెల్యేల జీతాలు భారీగా పెంపు!
-
డ్రగ్స్ రాకెట్‌పై స్పందించిన చార్మీ తండ్రి
-
మాయా రాజీనామా.. భారీ వ్యూహం!
-
సెల్ఫోన్లు లాక్కుని, వీడియోలు డిలీట్ చేసిన పూరీ తమ్ముడు
-
కేటీఆర్‌పై షబ్బీర్ అలీ ఫైర్
-
కాంగ్రెస్‌కు భారీ ఎదురుదెబ్బ..బీజేపీలోకి మాజీ సీఎం..
-
జగన్‌కు మంత్రి సవాల్
-
ఫ్లిప్‌కార్ట్ మరో భారీ ఆఫర్








