News

కేసీఆర్‌కు నేడు ఆపరేషన్


తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు నేడు కంటి ఆపరేషన్ చేయనున్నారు. ఆపరేషన్‌కు అవసరమైన ఏర్పాట్లు డాక్టర్లు పూర్తి చేశారు. నాలుగు రోజుల విశ్రాంతి తర్వాత కేసీఆర్ హైదరాబాద్‌కు వచ్చే అవకాశముంది. ఆయన కుడి కంటిపై పొర ఏర్పడింది. చూపు కాస్త మందగించింది. దాన్ని తొలగించడానికి ఆపరేషన్ చేయనున్నారు. ఇంతకు ముందు ఆయన ఢిల్లీ వెళ్లినపుడే ఆపరేషన్ చేయించుకోవాలనుకున్నారు. ఆపరేషన్ అవసరమా.. లేదా మందులతో తగ్గిపోతుందా? అనే సందేహంతో డాక్టర్లు ఆపరేషన్‌ను వాయిదా వేశారు. తాజాగా పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు శస్త్ర చికిత్స నిర్వహించాలని సూచించిన విషయం తెలిసిందే. దీంతో కేసీఆర్ కూడా ఆపరేషన్‌కు అంగీకరించారు.