News
వైసీపికి గుడ్‌బై చెప్పి టీడీపీలోకి
చిలమత్తూరు మేజర్ పంచాయితీ సర్పంచ్ శ్రీకళ వైసీకి గుడ్‌బై చెప్పి టీడీపీలో చేరారు. హిందూపురంలోని ఎమ్మెల్యే బాలకృష్ణ ఇంటిలో ఆదివారం ఆమె తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఎమ్మెల్యే బాలయ్య ఆమెకు పార్టీ కండువా కప్పి టీడీపీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా శ్రీకళ మాట్లాడుతూ.. నియోజకవర్గ అభివృద్ధికి నందమూరి బాలకృష్ణ ఇతోధికంగా కృషి చేస్తున్నట్లు ప్రశంసించారు. సీఎం చంద్రబాబు నాయుడు అమలుచేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలపట్ల సంతృప్తి చెంది తాను టీడీపీలో చేరుతున్నట్లు ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే అబ్ధుల్ఘని, ఎమ్మెల్యే పీఏ వీరయ్య, పార్టీ సమన్వయ కర్త క్రిష్ణమూర్తి, ఎంపీపీ నౌజియాబాను, జడ్పీటీసీ లక్ష్మీ నారాయణరెడ్డి, టీడీపీ నాయకులు జేఈ వెంకటస్వామి, అన్సార్ అహ్మద్, చంద్రారెడ్డి, బాబు రెడ్డి, మన్సూర్ అహ్మద్, సుబ్బు పాల్గొన్నారు.
Related News
-
అమ్మ ఫొటో మాయమైంది
-
నడిరోడ్డుపై కారులో మంటలు...
-
ఎమ్మెల్యేల జీతాలు భారీగా పెంపు!
-
డ్రగ్స్ రాకెట్‌పై స్పందించిన చార్మీ తండ్రి
-
మాయా రాజీనామా.. భారీ వ్యూహం!
-
సెల్ఫోన్లు లాక్కుని, వీడియోలు డిలీట్ చేసిన పూరీ తమ్ముడు
-
కేటీఆర్‌పై షబ్బీర్ అలీ ఫైర్
-
కాంగ్రెస్‌కు భారీ ఎదురుదెబ్బ..బీజేపీలోకి మాజీ సీఎం..
-
జగన్‌కు మంత్రి సవాల్
-
ఫ్లిప్‌కార్ట్ మరో భారీ ఆఫర్








