News
సర్వే రిపోర్టు్కు జగన్ షాక్
ఏపీలో వైసీపీ పరిస్థితిపై ప్రశాంత్ కిషోర్ చేసిన సర్వేను దగ్గరపెట్టుకుని జగన్మోహన్ రెడ్డి దిద్దుబాటు చర్యలు ప్రారంభించారు. పనితీరు బాగోలేని, ప్రజల్లో పలుకబడిని కోల్పోయిన నేతలను వదిలించుకోవాలని నిర్ణయించుకున్నారు. దీని కోసం జిల్లాలవారి సమావేశాలు ప్రారంభించారు. ఏపీలో అధికారం దక్కించుకునేందుకు వైసీపీ ఎన్నికల వ్యూహ కర్త ప్రశాంత్ కిషోర్‌ను నియమించుకుంది. వచ్చే ఎన్నికల వరకూ సలహాలు, సూచనలు ఇచ్చేందుకు ప్రశాంత్ భారీ మొత్తం వసూలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అందుకే క్షేత్రస్థాయిలో వైసీపీ పరిస్థితిని అంచనా వేయడానికి సొంత బృందంతో సర్వే నిర్వహించారు.
సిట్టింగ్ ఎమ్మెల్యేలు, నియోజకవర్గం ఇన్చార్జులపై కూడా వివిధ దశల్లో అభిప్రాయసేకరణ జరిపారు. ఆ నివేదికను ప్రశాంత్, జగన్‌కు అందించారు. ఆ సర్వేలో బయటపడిన అంశాలు జగన్‌ను ఓ రకంగా షాక్‌కు గురిచేశాయని వైసీపీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో సగానికి సగం మంది గెలిచే పరిస్థితిలో లేరని ఆ సర్వేలో తేలినట్లు సమాచారం. చాలా మంది ప్రజలకు అందుబాటులో ఉండకపోవడం మైనస్ కాగా, మరికొంత మంది ప్రజలకు సంబంధించి చిన్న సమస్య పరిష్కరించడానికి కూడా ప్రయత్నించడంలేదని తేలింది. ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్చార్జులపై 20 ప్రశ్నలతో కూడిన సర్వే పత్రం ద్వారా అభిప్రాయాలు తీసుకుని ఫలితాన్ని క్రోడీకరించారు. రాయలసీమలో కడప, కర్నూల్, అనంతపురం జిల్లాల్లో పార్టీ పరంగా సానుకూలత కనిపించినా చిత్తూరు జిల్లాలో మాత్రం బలహీనపడినట్లుగా తేలింది. రోజా వ్యవహారం పార్టీకి చేటు తెస్తోందని సర్వేలో తేలినట్లు ప్రచారం జరుగుతోంది. సమస్యలపై పోరాడాల్సిపోయి మీడియాలో హైలట్ కావడానికి రోజా చేస్తున్న ట్వీట్లు ప్రజల్లో వ్యతిరేకత పెరగడానికి కారణంగా సర్వేద్వారా తేల్చారు. ప్రశాంత్ కిషోర్ సలహాలు, సూచనలను పక్కాగా పాటించాలని డిసైడ్ అయిన జగన్ సర్వే రిపోర్టులు సీరియస్‌గా తీసుకున్నారు. దీనిపై పార్టీ ముఖ్యనేతలతో అత్యవసర సమావేశాలు నిర్వహించారు. జిల్లాల వారీగా పార్టీ నేతలతో సమావేశం అవుతున్నారు.
Related News
-
అమ్మ ఫొటో మాయమైంది
-
నడిరోడ్డుపై కారులో మంటలు...
-
ఎమ్మెల్యేల జీతాలు భారీగా పెంపు!
-
డ్రగ్స్ రాకెట్‌పై స్పందించిన చార్మీ తండ్రి
-
మాయా రాజీనామా.. భారీ వ్యూహం!
-
సెల్ఫోన్లు లాక్కుని, వీడియోలు డిలీట్ చేసిన పూరీ తమ్ముడు
-
కేటీఆర్‌పై షబ్బీర్ అలీ ఫైర్
-
కాంగ్రెస్‌కు భారీ ఎదురుదెబ్బ..బీజేపీలోకి మాజీ సీఎం..
-
జగన్‌కు మంత్రి సవాల్
-
ఫ్లిప్‌కార్ట్ మరో భారీ ఆఫర్








