News

జగన్‌కు దేవినేని కౌంటర్


వైసీపీ అధినేత జగన్‌కు దేవినేని ఉమ ఘాటైన కౌంటర్ ఇచ్చారు. 12 సీబీఐ చార్జిషీట్లు ఉన్న జగన్‌ను ఎన్ని సార్లు తన్ని తగలేశారని ప్రశ్నించారు. నిన్న విశాఖలో జరిగిన మహా ధర్నాలో జగన్ మాట్లాడుతూ భూ కుంభకోణంపై సీబీఐతో విచారణ జరిపిస్తే సీఎం చంద్రబాబుని, ఆయన కొడుకుని తంతారంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీనిపై ఉమ మాట్లాడుతూ 12చార్జిషీట్లలో ఏ1 ముద్దాయిగా ఉన్న జగన్ తమపై సీబీఐ కేసులు అడుగుతారా అంటూ ధ్వజమెత్తారు. జగన్ మాట్లాడిందే నిజమైతే ఆయన 12సీబీఐ కేసుల్లో తన్నులు తిన్నారా? అని ప్రశ్నించారు. 12 సీబీఐ కేసుల్లో తన్నులు తిని 16నెలలు జైల్లో ఉండి తమనెందుకు ఆడిపోసుకుంటున్నారని ప్రశ్నించారు. పదేళ్లు జగన్ చేసిన పాపాలకే ఆయన కన్నతల్లినే విశాఖ ప్రజలు ఓడించారన్నారు. విశాఖలో వైసీపీని తరిమి తరిమి కొట్టారన్నారు. చంద్రబాబు, లోకేశ్‌ల పేర్లు ఎత్తే నైతిక అర్హత జగన్‌కు లేదన్నారు.