News
జగన్‌కు దేవినేని కౌంటర్
వైసీపీ అధినేత జగన్‌కు దేవినేని ఉమ ఘాటైన కౌంటర్ ఇచ్చారు. 12 సీబీఐ చార్జిషీట్లు ఉన్న జగన్‌ను ఎన్ని సార్లు తన్ని తగలేశారని ప్రశ్నించారు. నిన్న విశాఖలో జరిగిన మహా ధర్నాలో జగన్ మాట్లాడుతూ భూ కుంభకోణంపై సీబీఐతో విచారణ జరిపిస్తే సీఎం చంద్రబాబుని, ఆయన కొడుకుని తంతారంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీనిపై ఉమ మాట్లాడుతూ 12చార్జిషీట్లలో ఏ1 ముద్దాయిగా ఉన్న జగన్ తమపై సీబీఐ కేసులు అడుగుతారా అంటూ ధ్వజమెత్తారు. జగన్ మాట్లాడిందే నిజమైతే ఆయన 12సీబీఐ కేసుల్లో తన్నులు తిన్నారా? అని ప్రశ్నించారు. 12 సీబీఐ కేసుల్లో తన్నులు తిని 16నెలలు జైల్లో ఉండి తమనెందుకు ఆడిపోసుకుంటున్నారని ప్రశ్నించారు. పదేళ్లు జగన్ చేసిన పాపాలకే ఆయన కన్నతల్లినే విశాఖ ప్రజలు ఓడించారన్నారు. విశాఖలో వైసీపీని తరిమి తరిమి కొట్టారన్నారు. చంద్రబాబు, లోకేశ్‌ల పేర్లు ఎత్తే నైతిక అర్హత జగన్‌కు లేదన్నారు.
Related News
-
అమ్మ ఫొటో మాయమైంది
-
నడిరోడ్డుపై కారులో మంటలు...
-
ఎమ్మెల్యేల జీతాలు భారీగా పెంపు!
-
డ్రగ్స్ రాకెట్‌పై స్పందించిన చార్మీ తండ్రి
-
మాయా రాజీనామా.. భారీ వ్యూహం!
-
సెల్ఫోన్లు లాక్కుని, వీడియోలు డిలీట్ చేసిన పూరీ తమ్ముడు
-
కేటీఆర్‌పై షబ్బీర్ అలీ ఫైర్
-
కాంగ్రెస్‌కు భారీ ఎదురుదెబ్బ..బీజేపీలోకి మాజీ సీఎం..
-
జగన్‌కు మంత్రి సవాల్
-
ఫ్లిప్‌కార్ట్ మరో భారీ ఆఫర్








