News

జగన్‌కు దిమ్మతిరిగే షాక్


భూ ఆక్రమణలకు వ్యతిరేకంగా విశాఖలో వైసీపీ చేపట్టిన మహాధర్నాలో వైసీపీ అధినేత జగన్‌కు పబ్లిక్ షాకిచ్చారు. మహా ధర్నా అనంతరం జరిగిన సభలో భూములు కోల్పోయిన రైతులతో జగన్ మాట్లాడించారు. ఈ సందర్భంగా బాషా అనే వ్యక్తి మాట్లాడుతూ తనకు 2005లో భూ పట్టా కేటాయించారని.. అన్ని డాక్యుమెంట్లు సరిగ్గానే ఉన్నాయని.. కానీ 2008లో అప్పటి కాంగ్రెస్ నేతలు తన భూమిని లాక్కున్నారని చెప్పారు. 2008లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్నారు. దీంతో బాషా చెప్పిన విషయంపై జగన్ ఎలాంటి స్పందనా వ్యక్తం చేయలేదు. బాషా మాత్రమే కాకుండా పలువురు రైతులు కూడా కాంగ్రెస్ హయాంలోనే తమ భూములు లాక్కున్నారని ఫిర్యాదు చేశారు.