News

బిఎస్ఎన్‌ఎల్‌ సరికొత్త ప్రీపెయిడ్‌ ఆఫర్‌


ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ భారత్‌ సంచార్‌ నిగమ్‌ లిమిటెడ్‌ (బిఎస్ ఎన్‌ఎల్‌) సరికొత్త ప్రీపెయిడ్‌ ఆఫర్‌ ‘చౌక 444’ ను తీసుకువచ్చింది. 3జి వేగంతో రోజుకు 4జిబి డేటాను 444 రూపాయలకే ఈ ఆఫర్‌ను అందించనున్నట్లు బిఎస్ ఎన్‌ఎల్‌ తెలిపింది. ప్రీపెయిడ్‌ మొబైల్‌ సర్వీసుల కింద స్పెషల్‌ ప్రమోషన్‌ ఆఫర్‌లో భాగంగా 90 రోజుల వ్యాలిడిటీతో అన్‌లిమిటెడ్‌ డేటాను 444 కింద ఆఫర్‌ చేస్తున్నట్లు పేర్కొంది. దేశంలో ఇంతవరకు ఏ టెలికాం ఆపరేటర్‌ రోజుకు ఇంత భారీ డేటాను ఆఫర్‌ చేయలేదని తెలిపింది. ఈ స్కీమ్‌లో భాగంగా ఒక గిగాబైట్‌ 3జి మొబైల్‌ డేటా రూపాయి కన్నా తక్కువ పడుతుందని పేర్కొంది. వినియోగదారులకు ఎప్పటికప్పుడు అత్యుత్తమైన సర్వీసులు అందించాలన్న ఉద్దేశంతో కొత్త ఆఫర్లను తీసుకువస్తున్నట్లు బిఎస్ ఎన్‌ఎల్‌ తెలిపింది.