News

డిసెంబర్‌ 31లోగా లింక్‌ చేసుకోవాలి


బ్యాంకు ఖాతా తెరిచేందుకు ఆధార్‌ తప్పనిసరి అని కేంద్రం స్పష్టం చేసింది. ఆధార్‌ అనుసంధానం లేని బ్యాంకు ఖాతాలు చెల్లవని ప్రకటించింది. రూ.50 వేలకు పైగా లావాదేవీలకు ఆధార్‌ తప్పనిసరి చేస్తున్నట్లు కేంద్రం తెలిపింది. డిసెంబర్‌ 31లోగా ఖాతాలకు ఆధార్‌ లింక్‌ చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. ఈ మేరకు ఖాతాదారులకు అవగాహన కల్పించాలని బ్యాంకులకు సూచించింది.