News
చంద్రబాబుకు ముఖ్యమంత్రి లేఖ
తమిళనాడు ముఖ్యమంత్రి ఎడపాడి పళని స్వామి చిత్తూరు జిల్లా మీదుగా ప్రవహిస్తూ తమిళనాడులో ప్రవేశించే కుశస్థలి నది పాయ వద్ద చెక్ డామ్ నిర్మాణాన్ని ఆపాలంటూ ... ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు లేఖ రాశారు. చిత్తూరు జిల్లా కార్వేటి నగరం మండలం లో ఆంధ్ర ప్రదేశ్ చెక్ డ్యామ్ నిర్మించ తలపెట్టినట్లు తన లేఖలో పేర్కొన్న పళనిస్వామి తమిళనాడు, ఆంధ్ర ప్రదేశ్ లో ప్రవహించే ఈ నది అంత రాష్ట్ర నది అని పేర్కొన్నారు. ఈ నది నీటిపై ఆధార పడి తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లాలో వందలాది ఎకరాల సాగు జరుగుతోందని తెలిపారు. ఈ నదిపై ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం చెక్ డ్యామ్ కడుతున్నట్లు తెలిసిందని ..దీని వల్ల తమ రాష్ట్రంలో ఆ నది పరివాహక ప్రాంతంలోని రైతులు ఇబ్బందులు పడతారని.. ఈ విషయంలో జోక్యం చేసుకుని చెక్ డ్యాం నిర్మాణాన్ని ఆపాలని తమిళనాడు ముఖ్యమంత్రి పళని స్వామి ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని కోరారు.
Related News
-
అమ్మ ఫొటో మాయమైంది
-
నడిరోడ్డుపై కారులో మంటలు...
-
ఎమ్మెల్యేల జీతాలు భారీగా పెంపు!
-
డ్రగ్స్ రాకెట్‌పై స్పందించిన చార్మీ తండ్రి
-
మాయా రాజీనామా.. భారీ వ్యూహం!
-
సెల్ఫోన్లు లాక్కుని, వీడియోలు డిలీట్ చేసిన పూరీ తమ్ముడు
-
కేటీఆర్‌పై షబ్బీర్ అలీ ఫైర్
-
కాంగ్రెస్‌కు భారీ ఎదురుదెబ్బ..బీజేపీలోకి మాజీ సీఎం..
-
జగన్‌కు మంత్రి సవాల్
-
ఫ్లిప్‌కార్ట్ మరో భారీ ఆఫర్








