News

అసెంబ్లీని ఎలా నడుపుతారో చూస్తా!


రైతు దీక్షతోనైనా ప్రభుత్వం స్పందించి వారికి న్యాయం చేయకుంటే జీఎ్‌సటీ బిల్లు ఆమోదం కోసం త్వరలో నిర్వహించాలనుకుంటున్న అసెంబ్లీ సమావేశాలను ఎలా నడుపుతారో చూస్తానని వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ హెచ్చరించారు. మిర్చితోపాటు ఇతర వ్యవసాయ పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్‌ చేస్తూ గుంటూరు నల్లపాడు రోడ్డులో ఆయన సోమవారం చేపట్టిన రైతు దీక్ష మంగళవారం మధ్యాహ్నం మూడు గంటల సమయంలో ముగిసింది. ఓ రైతు చేతులమీదుగా నిమ్మరసం తాగి ఆయన దీక్ష విరమించారు. ఈ సందర్భంగా చంద్రబాబు ప్రభుత్వంపై జగన్‌ నిప్పులు చెరిగారు. ఇప్పటికీ ప్రభుత్వంలో కదలిక రాకుంటే పోరాటం మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు