News

తలాక్‌ చెల్లదు


త్రిపుల్‌ తలాక్‌, నిఖా హలాలా, బహు భార్యత్వం వంటివి ముస్లిం మహిళలకు రాజ్యాంగం ప్రసాదించిన ప్రాథమిక హక్కులకు భంగం కలిగిస్తున్నాయి. సమాజంలో వారి స్థాయిని, గౌరవాన్ని దెబ్బతీస్తున్నాయి. అని కేంద్ర ప్రభుత్వం పునరుద్ఘాటించింది. తలాక్‌, నిఖా హలాలా  బహుభార్యత్వాన్ని పలు ముస్లిం సంఘాలు సుప్రీంకోర్టులో సవాలు చేశాయి. ఈ అంశంపై వచ్చేనెల 11వ తేదీ నుంచి... వేసవి సెలవుల్లోనూ విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు సిద్ధమైంది. కోర్టు ఆదేశాల మేరకు కేంద్ర ప్రభుత్వం ఈ అంశాలపై తాజాగా, లిఖితపూర్వకంగా తన వైఖరిని తెలియచేసింది