News

జర్నలిస్ట్‌లకు హెచ్చరిక


అమెరికాలో జర్నలిస్టులపై కొత్తగా ఎన్నికైన అమెరికా అద్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మండిపడ్డారు. నిజాయితీలేని వ్యక్తులుగా జర్నలిస్టులు వ్యవహరిస్తున్నారని ఆయన విమర్శించారు. తన ప్రమాణ స్వీకరానికి పదిలక్షల మందికి పైగా జనం వస్తే జనం రాలేదన్నట్లు,మీడియాలో ఖాళీ గా ప్రదేశాలను మీడియా చూపించిందని ఆయన విమర్శించారు. గత కొంతకాలంగా మీడియాతో యుద్దం చేస్తున్నానని ట్రంప్ వ్యాఖ్యానించారు. మీడియా వైఖరిలో మార్పు రావాలని, మరోసారి ఇలా చేస్తే బాగోదని ఆయన హెచ్చరించారు.