News
అచ్చెన్నాయుడి కంటే ఆయనే బెటర్
జనసేన అధినేత పవన్‌కల్యాణ్ ఉద్దానం బాధితుల పట్ల ప్రభుత్వం సానుకూలంగా స్పందించడాన్ని స్వాగతిస్తున్నామని ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఉద్దానం బాధితుల పట్ల శ్రీకాకుళానికి చెందిన మంత్రి అచ్చెన్నాయుడి కంటే సీఎం చంద్రబాబు స్పందించిన తీరు బాగుందని అన్నారు. భవిష్యత్తులో ఈ అంశాన్ని అన్ని రాజకీయ పార్టీలు తమ మ్యానిపెస్టోలో చేర్చాలని కోరారు. కిడ్నీ బాధితుల సమస్యలపై కేంద్రంపై వత్తిడి పెంచాలని ట్విట్టర్ ద్వారా కోరారు. సామాజికవేత్తలు, ఉత్తరాంధ్రకు చెందిన మేధావులు, వైద్యులు ఈ సమస్యకు పరిష్కారం దొరికెదాక ప్రభుత్వం ఒత్తడి పెంచాలని పేర్కొన్నారు. ఇటీవల ఉద్దానం వెళ్లిన పవన్ కిడ్నీ బాధితులతో ప్రత్యేకంగా సమావేశం అయిన విషయం తెలిసిందే. వారి సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు. పవన్ పర్యటన తర్వాత జన్మభూమి కార్యక్రమంలో పాల్గొనేందుకు శ్రీకాకుళం వెళ్లిన సీఎం చంద్రబాబు ఉద్దానం కిడ్నీ బాధితుల సమస్యలపై స్పందించారు. ఈ నెల 26 నాటికి ఎట్టి పరిస్థితుల్లోను తాగునీరు అందించాలని అధికారులను ఆదేశించారు. కుప్పం తరహాలో ఉద్దానంలో కూడా మంచినీటి ప్రాజెక్టును ఏర్పాటు చేయాలని గ్రామీణభివృద్ది కమీషనర్‌ను ఆదేశించారు.
Related News
-
అమ్మ ఫొటో మాయమైంది
-
నడిరోడ్డుపై కారులో మంటలు...
-
ఎమ్మెల్యేల జీతాలు భారీగా పెంపు!
-
డ్రగ్స్ రాకెట్‌పై స్పందించిన చార్మీ తండ్రి
-
మాయా రాజీనామా.. భారీ వ్యూహం!
-
సెల్ఫోన్లు లాక్కుని, వీడియోలు డిలీట్ చేసిన పూరీ తమ్ముడు
-
కేటీఆర్‌పై షబ్బీర్ అలీ ఫైర్
-
కాంగ్రెస్‌కు భారీ ఎదురుదెబ్బ..బీజేపీలోకి మాజీ సీఎం..
-
జగన్‌కు మంత్రి సవాల్
-
ఫ్లిప్‌కార్ట్ మరో భారీ ఆఫర్








