News
ఎయిర్‌టెల్ బంపర్ ఆఫర్
రిలయన్స్ జియో దెబ్బతో టెలికామ్ కంపెనీలు దిగి వస్తున్నాయి. జియో 4జీ వెల్‌కమ్ ఆఫర్‌ను కొత్త ఏడాది కానుకగా మార్చి 31 వరకు రిలయన్స్ పొడిగించింది. అయితే దీనికి పోటీగా ఎయిర్‌టెల్ బంపర్ ఆఫర్‌తో ముందుకు వచ్చింది. 2017 డిసెంబర్ వరకు 4జీ కాల్స్, 3జీబీ డేటా ఉచితమని మంగళవారం ప్రకటించింది. అయితే ఎంపిక చేసిన ప్రీ, పోస్ట్ పెయిడ్ ప్యాకేజీలపై మాత్రమే ఇది వర్తిస్తుందని భారతీ ఎయిర్‌టెల్ స్పష్టం చేసింది. 4జీ మొబైల్ కలిగినవారు ఎయిర్‌టెల్ 4జీ నెట్ వర్క్‌కు మారాల్సి ఉంటుంది. ఎయిర్‌టెల్ 3జీ వినియోగదారులు 4జీకి అప్‌గ్రేడ్ కావాలి. ప్రీ పెయిడ్ వినియోగదారులు రూ.345 ప్యాకేజీతో దేశంలోని ఏ నెట్‌వర్క్‌కైనా అపరిమితంగా కాల్స్ చేసుకోవడంతోపాటు 4జీ డేటాను 1జీబీ వరకు ఉచితంగా పొందవచ్చని తెలిపింది. 4జీకి మారిన వారు ఇన్ఫినిటీ ప్యాకేజీలతో అపరిమిత కాల్స్‌తో పాటు నెలకు 3జీబీ డేటాను ఏడాది పాటు ఉచితంగా పొందవచ్చని పేర్కొంది. బుధవారం నుంచి మొదలయ్యే ఈ ఆఫర్ ఫిబ్రవరి 28తో ముగుస్తుందని ఎయిర్‌టెల్ ప్రకటించింది.
Related News
-
అమ్మ ఫొటో మాయమైంది
-
నడిరోడ్డుపై కారులో మంటలు...
-
ఎమ్మెల్యేల జీతాలు భారీగా పెంపు!
-
డ్రగ్స్ రాకెట్‌పై స్పందించిన చార్మీ తండ్రి
-
మాయా రాజీనామా.. భారీ వ్యూహం!
-
సెల్ఫోన్లు లాక్కుని, వీడియోలు డిలీట్ చేసిన పూరీ తమ్ముడు
-
కేటీఆర్‌పై షబ్బీర్ అలీ ఫైర్
-
కాంగ్రెస్‌కు భారీ ఎదురుదెబ్బ..బీజేపీలోకి మాజీ సీఎం..
-
జగన్‌కు మంత్రి సవాల్
-
ఫ్లిప్‌కార్ట్ మరో భారీ ఆఫర్








