News

బీఎస్‌పీ అభ్యర్థుల ఖరారు


త్వరలో జరగనున్న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల కోసం పార్టీలు సమాయత్తమవుతున్నాయి. యూపీలో ప్రధాన పార్టీలలో ఒకటైన బహుజన్ సమాజ్‌వాది పార్టీ(బీఎస్‌పీ) అభ్యర్థులను ఖరారు చేసినట్లు పార్టీ అధినేత మాయావతి స్పష్టం చేశారు. మొత్తం 403 స్థానాలు ఉన్న యూపీలో అన్ని స్థానాలకు పోటీచేయడానికి పార్టీ తరపున అభ్యర్థులను సిద్ధం చేసినట్లు ఓ ప్రకటనలో తెలిపారు. అందులో ఎస్సీ-87, మైనార్టీ-97, ఓబీసీ-106, ఓసీ -113 వారీగా అభ్యర్థులను కేటాయించినట్లు పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో బీఎస్పీ ఏ పార్టీతోను పొత్తు పెట్టుకోదని, ఒంటరిగా ఎన్నికల బరిలోకి దిగబోతోందని మాయావతి స్పష్టం చేశారు.