News

జగన్‌ఫై దివాకర్‌రెడ్డి తీవ్ర విమర్శలు


ఏం మాట్లాడాతాడో వాడికే తెలియదంటూ ప్రతిపక్ష నేత జగన్‌ను ఉద్దేశించి ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి విమర్శలు గుప్పించారు. జగన్ దగ్గర తనకు ఉన్న చనువుతో ఏకవచనంలో వాడు అని అంటుంటానని చెప్పారు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డితో ఉన్న అనుబంధం వల్ల జగన్ చిన్నప్పటి నుంచి తనకు తెలసుసని దివాకర్‌రెడ్డి చెప్పుకోచ్చారు. జగన్‌కు తిట్టడం తప్ప మరొకటి తెలియదన్నారు. ‘జగన్‌ తిక్కముండా కొడుకు’ అని కాస్త ఘాటైన పదజాలం ఉపయోగించారు జేసీ. ప్రజల ఓట్లు కావాలనుకునే వారు పట్టిసీమను వ్యతిరేకిస్తారా... అని ప్రశ్నించారు. ప్రజలందరూ పోలవరం కావాలని కోరుకుంటుంటే జగన్ ఎందుకు వ్యతిరేకిస్తూన్నాడో అర్థం కావడం లేదన్నారు.